Hardik Pandya | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఈ నెల 22న మొదలవనున్నది. కోల్‌కతా నైట్‌రైడర్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో ముంబయి ఇండియన్ మార్చి 23న తొలి మ్యాచ్‌ను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్ ఆడనున్నది. మ్యాచ్‌కు ముందే ముంబయికి షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. మ్యాచ్ నిషేధం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమవనున్నాడు.
హార్దిక్ పాండ్యా గత సీజన్లోనే ముంబయి కెప్టెన్‌గా చేశాడు. అతని కెప్టెన్సీలో ముంబయి జట్టు చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అంతే కాకుండా పాండ్యా కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు మూడోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ పాలకవర్గం జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం.. మూడుసార్లు స్లో ఓవర్ గురవడంతో కెప్టెన్‌కు రూ.30లక్షల జరిమానాతో పాటు మ్యాచ్ నిషేధం విధిస్తారు.
గ్రూప్ దశలోనే ముంబయి ఇండియన్స్ స్లో ఓవర్ రేట్‌కు గురైంది. ఆ జట్టు ప్లేఆఫ్‌లోకి ప్రవేశించకపోవడంతో హార్దిక్ పాండ్యాపై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్‌లోనే నిషేధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో చెన్నైతో జరిగే మ్యాచ్‌కు పాండ్యా దూరం ఉండాల్సి రానున్నది. ఇక పాండ్యాపై నిషేధం నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే చర్చ జరుగుతున్నది.
గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడేది అనుమానమే. ఈ పరిస్థితుల్లో సూర్య కుమార్ యాదవ్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలో ఎవరు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారనే చర్చ సాగుతున్నది. టీ20 క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్‌కు మంచి రికార్డు ఉన్నది. అతని కెప్టెన్సీలో టీమిండియా 18 మ్యాచుల్లో.. కేవలంలో నాలుగు మ్యాచుల్లోనే ఓడిపోయింది. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ స్పందించలేదు.