న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) .. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ యేటి ఐపీఎల్లో ఆ జట్టు సారధిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ తప్పుకోవడంతో.. అతని స్థానంలో అక్షర్ పటేల్ ను ప్రకటించారు. 31 ఏళ్ల అక్షర్ 2019 నుంచి ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాడు. అతన్ని 16.50 కోట్లకు ఆ జట్టు రిటేన్ చేసుకున్నది.
గతంలో గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా చేసిన అనుభవం అక్షర్‌కు ఉంది. ఈ ఏడాది ఆరంభంలో భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. గత సీజన్లో అతను ఢిల్లీ జట్టు తరపున 235 రన్స్ స్కోర్ చేశాడు. 11 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారధిగా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నట్లు అక్షర్ తెలిపాడు. ఓ క్రికెటర్‌గా ఎదిగానని, కెప్టెన్సీ చేపట్టేందుకు విశ్వాసంతో రెఢీగా ఉన్నట్లు తెలిపాడు.
వాస్తవానికి ఢిల్లీ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేపడుతాడన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ పాత్రను పోషించేందుకు రాహుల్ సముఖంగా లేనట్లు తెలిసింది. రిషబ్ పంత్ కెప్టెన్సీ చేపట్టేందుకు నిరాకరించడంతో.. అక్షర్‌ను ఆ ఛాన్స్ వరించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటి వరకు 150 మ్యాచ్‌లు ఆడాడు అక్షర్. అతను మొత్తం 1653 రన్స్ చేశాడు. 123 వికెట్లు తీశాడు.
Axar Patel
Captain, Delhi Capitals 💙❤️ pic.twitter.com/S2qNuuBO7T— Delhi Capitals (@DelhiCapitals) March 14, 2025