IPL 2025 | చాంపియన్స్ ట్రోఫీలో జరిగిన అవమానంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ను బహిష్కరించాలంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేశాడు. బీసీసీఐ తమ ఆటగాళ్లను విదేశీ టీ20 లీగ్‌లో ఆడేందుకు అనుమతించడం లేదని.. ఆయా బోర్డులు సైతం అదే వైఖరిని అవలంభింస్తూ ప్లేయర్‌కు అనుమతి ఇవ్వొద్దని ఇంజమామ్ పేర్కొన్నారు. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో సహా చాలా మంది భారతీయ మహిళా క్రికెటర్లు బీబీఎల్, డబ్ల్యూసీపీఎల్, ది హండ్రెడ్ వంటి విదేశీ లీగ్‌లలో ఆడుతున్నారు.
కానీ, మెన్స్ ప్లేయర్స్ ఐపీఎల్ తప్పా మరే ఇతర లీగ్స్‌లో ఆడడం లేదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగ్‌లలో ఆటగాళ్లు ఆడకుండా బీసీసీఐ నిషేధించింది. పాక్‌కు చెందిన ఓ న్యూస్ చానెల్‌తో ఇంజమామ్ మాట్లాడారు. ‘చాంపియన్స్ ట్రోఫీని పక్కనపెడితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ పాల్గొనే ఐపీఎల్‌ను చూడండి. కానీ, భారత ఆటగాళ్లు మరే ఇతర లీగ్‌లోనూ ఆడేందుకు వెళ్లరు. కాబట్టి మిగతా అన్ని బోర్డులు తమ ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపడం మానుకోవాలి. బీసీసీఐలాగే ఇతర బోర్డులు అలాగే చేయకూడదా’ అంటూ ఇంజమామ్ ప్రశ్నించాడు. భారత క్రికెటర్లు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాతే విదేశీ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఉంది.
దినేశ్ కార్తీక్ గత సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఎస్ఏ20లో పార్ల్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు ఆటగాళ్లు జీటీ20 కెనడా, లంక ప్రీమియర్ లీగ్ టోర్నీల్లోనూ పాల్గొన్నారు. కానీ, ఈ ఇద్దరు ప్లేయర్స్ రిటైర్మెంట్ అయ్యాకే ఆయా లీగ్‌లో ఆడారు. ఇదిలా ఉండగా ఐపీఎల్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగనున్నది. ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగనున్నది.