ఢిల్లీ : ఐపీఎల్-18 సీజన్లో నాకౌట్ మ్యాచ్‌ల వేదికలు మారాయి. పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్‌కతా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. తాజాగా వాటిని ముల్లాన్‌పూర్ (చండీగఢ్), అహ్మదాబాద్‌కు మార్చారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం టైటిల్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్‌లో జరగాల్సిన క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లను మే 29, 30న ముల్లాన్‌పూర్ (చండీగఢ్) లోని న్యూపీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు.
జూన్ 01న క్వాలిఫయర్-2, 03న అహ్మదాబాద్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ నిరాశజనక ప్రదర్శనతో డీలాపడ్డ హైదరాబాద్ అభిమానులు.. నాకౌట్ మ్యాచ్‌లను అయినా వీక్షిద్దామని భావించినా వారికి నిరాశే ఎదురైంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ భారతంలో మ్యాచ్‌లను పూర్తిగా ఉత్తర భారతానికి తరలించారు. నాకౌట్ మ్యాచ్‌లతో పాటు సన్‌రైజర్స్, బెంగళూరు మధ్య ఈనెల 23నమ్యాచ్నూ లక్నోకు తరలించినట్టు బీసీసీఐ తెలిపింది.