IOA : భారత బాక్సింగ్ సమాఖ్య ఎన్నికలపై నెలకొన్న అనిశ్చితికి త్వరలోనే తెరపడనుంది. కార్యవర్గం పదవీ కాలం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా.. ఎన్నికలు జరగకపోవడంపై ఆగ్రహించిన ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha) కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ నిర్వహణకు ఆటంకంగా మారిన అంశాలను నిగ్గు తేల్చడం కోసం ఆదివారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
‘ప్రస్తుతం కార్యనిర్వాహక మండలిలో ఉన్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ముగిసింది. అయినా సరే ఇప్పటివరకూ కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు మాత్రం జరుగలేదు. దాంతో, దేశంలో బాక్సింగ్ పోటీల నిర్వహణ, బీఎఫ్ఐ పనితీరుపై ప్రభావం పడుతోంది. అందుకే.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాం. వారం రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది’ అని ఉష తెలిపింది.
🚨 #BreakingNews 🚨 IOA President PT Usha forms committee to ascertain delay in BFI elections https://t.co/AyZdL4PhdC
IOA President PT Usha has formed a three-member Fact-Finding Committee to investigate the delayed BFI elections and propose a fair election roadmap. This actio…
— Instant News ™ (@InstaBharat) July 13, 2025
ఐఓఏ చీఫ్ ఉష ఏర్పాటు చేసిన కమిటీలో కోశాధికారి సహదేవ్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల్లో ఒకరైన భూపేందర్ సింగ్ భజ్వా, న్యాయవాది పాయల్ కక్రాలు సభ్యులు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు నిర్వహణ గురించి,కాల వ్యవధి ముగిన వెంటనే ప్రక్రియను చేపట్టడం గురించి పలు సూచనలు చేయనుంది. బాక్సింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణలో చొరవ తీసుకోవాలని క్రీడా మంత్రిత్వ శాఖ జూలై 5న ఉషకు లేఖ రాసింది. సో.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమిటీ ఏర్పాటుతో సమస్యను పరిష్కరించడానికి సిద్ధమైంది ఐఓఏ చీఫ్.