OU Doctorate | షాద్‌నగర్‌టౌన్, జూలై 13 : ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ఇటివలే అందుకున్న షాద్‌నగర్ మున్సిపాలిటీ శ్రీనగర్‌కాలనీకి చెందిన పానుగంటి రాణిని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పలువురు ఆదివారం అభినందించారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని డిప్యూటీ ఆఫ్ ఫిజిక్స్, ఆసోసియేట్ ప్రొఫెసర్ నథానియేల్ పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్ అండ్ మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రేర్ ఎర్త్(సీఈ, జీడీ, డీవై, ఎన్ఐ-జెడ్ఎన్) డాప్డ్ నానో ఫెర్రిట్స్ అనే అంశంపై పరిశోధన చేసి సమర్పించడం జరిగిందని, ఇందులో భాగంగానే డాక్టరేట్ అందుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తూ పీహెచ్డీ పూర్తి చేయడంతో పాటు ప్రస్తుతం కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టరేట్‌ను అందుకున్న ఆమెను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.