Pratika Rawal : మహిళల టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన భారత జట్టు లార్డ్స్(Lords)లో చారిత్రాత్మక టెస్టుకు సిద్ధమవుతోంది. శుక్రవారం (జూలై 10) ఆతిథ్య ఇంగ్లండ్‌తో తలపడనున్న టీమిండియా గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. మ్యాచ్‌కు ముందే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. మిడిలార్డర్ బ్యాటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో ఏకైక టెస్టుకు దూరమైంది. గత వారం ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ప్రతీక ఇంకా కోలుకోలేదు.
ఇంగ్లండ్ గడ్డపై పొట్టి వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టుకు సువర్ణావకాశం వచ్చింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్టులో టీమిండియా ఆడనుంది. శుక్రవారం హర్మన్‌ప్రీత్ సేన ఏకైక టెస్టులో ఆతిథ్య జట్టును ఢీకొడనుంది. వరల్డ్‌కప్ వైఫల్యం నుంచి బయటపడి.. విజయంతో స్వదేశం రావాలనుకుంటున్న భారత్ కీలక బ్యాటరైన ప్రతీకా రావల్ సేవల్ని కోల్పోయింది. వారం క్రితం ఇండియా -ఏ, ఇంగ్లండ్ -ఏ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ప్రతీక ఇంకా కోలుకోలేదు.
🚨 News 🚨
Priya Punia replaces injured Pratika Rawal in #TeamIndia‘s squad for England Test.
More Details 🔽 | #ENGvIND https://t.co/qOfXZORjPi
— BCCI Women (@BCCIWomen) July 9, 2026
‘ప్రతీకకు మోకాలిపై గాయం కావడంతో కుట్లు పడ్డాయి. అందువల్లే ఆమె లార్డ్స్ టెస్టుకు దూరమైంది. ఆమె స్థానంలో ప్రియా పూనియాను స్క్వాడ్‌లోకి తీసుకున్నాం’ అని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ తెలిపాడు. అయితే.. మూడో స్థానంలో ఆడే ప్రతీక బదులు.. ఎవరిని ఆడిస్తారు? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఈ ప్లేస్ కోసం యస్తికా భాటియా, హర్లీన్ డియోల్ పోటీపడుతున్నారు.
భారత స్క్వాడ్ : స్మృతి మంధాన(వైస్ కెప్టన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), శ్రీ చరణి, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నందిని శర్మ, హర్లీన్ డియోల్, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘారే, స్నేహ్ రానా, ప్రియా పూనియా.