ECB : మరో వారంలో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. హ్యారీ బ్రూస్ (Harry Brook) సారథ్యంలో అక్కడ వన్డే, టీ20 వన్డే సిరీస్ ఆడనుంది. ఇప్పటికే స్క్వాడ్‌ను ప్రకటించేశారు కూడా. అయితే.. విండీస్ పర్యటనకు ముందే ఇంగ్లండ్‌కు పెద్ద షాక్. ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. కుడి చేతి బొటన వేలికి గాయం కారణంగా ఆర్చర్ విశ్రాంతి తీసుకోనున్నాడని బుధవారం ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
అయితే.. ఈ స్పీడ్‌స్టర్ స్థానంలో మరొకరిని ఈసీబీ ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే ఆర్చర్ బదులు స్క్వాడ్‌లోకి వచ్చే పేసర్ ఎవరో తెలియనుంది. 2109 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ హీరోగా పేరొందిన ఆర్చర్ తిరిగి 2022 నవంబర్‌లో వన్డేల్లో పునరాగమనం చేశాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకే గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న అతడు.. చివరిసారిగా 2023 సెప్టెంబర్‌లో ఐర్లాండ్‌పై ఆడాడు. వెస్టిండీస్ సిరీస్‌తో మళ్లీ వన్డే అవకాశం రాగా.. గాయంతో దూరం కావాల్సి వచ్చింది.
🚨 BREAKING NEWS 🚨
Jofra Archer has been ruled out of the ODI series against the West Indies due to a right thumb injury 🤕
Speedy recovery, Jof 🙏 pic.twitter.com/QGBes48XZv
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) May 21, 2025
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్ : హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జోస్ బట్లర్, జో రూట్, జేమీ స్మిత్, బ్రౌడన్ కార్సే, టామ్ హర్ట్లే, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమ్ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బ్యాంటన్, ఆదిల్ రషీద్.
ఐపీఎల్ 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరఫున అద్భుతంగా రాణించిన ఆర్చర్ 12 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. దాంతో, వెస్టిండీస్ పర్యటనలో ఈ స్పీడ్‌స్టర్ తమకు ప్రధాన అస్త్రంగా ఉపయోగపడుతాడని ఇంగ్లండ్ భావించింది. అయితే.. అతడు కుడిచేతి బొటన వేలి గాయంనుంచి కోలుకోలేదు. మే 4న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ సమయంలో గాయపడిన ఆర్చర్ ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశం వెళ్లాడు.
లీగ్ పునరుద్ధరణ తర్వాతి మ్యాచ్‌లు ఆడేందుకు ఆర్చర్ తిరిగి భారత్‌కు రాలేదు. ప్రస్తుతం ఈ పేసర్ తమ బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని ఈసీబీ తెలిపింది. కరీబియన్ పర్యటనలో ఇంగ్లండ్ మే 29 ఆతిథ్య విండీస్‌తో తొలి వన్డే ఆడనుంది. జూన్ 1న రెండో వన్డే, జూన్ 3న మూడో వన్డే జరుగనున్నాయి. జూన్ 6న పొట్టి సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఆతిథ్య వెస్టిండీస్‌ను ఢీ కొట్టనుంది.