Man takes selfie with skeleton | మహిళ మృతదేహాన్ని వెలికితీసి.. సెల్ఫీ తీసుకున్న యువకుడు
Man takes selfie with skeleton | ఒక యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు.
కోల్‌కతా: ఒక యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. (Man takes selfie with skeleton) ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతి కష్టంతో గ్రామస్తుల దాడి నుంచి ఆ యువకుడ్ని కాపాడారు. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంటాయ్ పరిధిలోని గ్రామానికి చెందిన ప్రభాకర్, ఏడేళ్ల కిందట పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు.
కాగా, గ్రామస్తులు ఇది చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రభాకర్‌ను పట్టుకుని కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ప్రభాకర్‌ను పోలీసులకు అప్పగించేందుకు గ్రామస్తులు నిరాకరించారు. అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
మరోవైపు రెండు గంటల తర్వాత అక్కడి పరిస్థితిని పోలీసులు నియంత్రించారు. గ్రామస్తుల దాడి నుంచి ప్రభాకర్‌ను కాపాడారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో మద్యం సీసా లభించడంతో తాగిన అతడు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సమాధి నుంచి మహిళ అస్థిపంజరాన్ని ఆ యువకుడు ఎందుకు బయటకు తీశాడో అన్నది తెలియలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

