Sagara Sangam leaders | జమ్మికుంట : ఇటీవల పోలీస్ శాఖలో బదిలీలల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతన సీఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించగా కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగరతో పాటు పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐకి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ శాంతి భద్రతలో పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు కుర్మిండ్ల అశోక్ కుమార్ సగర, బొడిపెల్లి సదానందం సగర తదితరులు పాల్గొన్నారు.