కట్టంగూర్, మే 21 : పిడుగుపాటుకు రెండు పాడి బర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్మిడి దామోదర్ రెడ్డి రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న వేప చెట్టుకు బర్రెలను కట్టేశాడు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపడటంతో రెండు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం అదుకోవాలని బాధిత రైతు కోరాడు.