INDWvsAUSW Test: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియాను 219 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఓపెనర్ స్మృతి మంధాన (74), జెమీమా రోడ్రిగ్స్ (73), రిచా ఘోష్ (52), ఆల్ రౌండర్ దీప్తి శర్మ (147 బంతుల్లో 70 నాటౌట్, 9 ఫోర్లు)తో పాటు పేస్ ఆల్ రౌండర్ పూజా వస్త్రకార్ (115 బంతుల్లో 33 నాటౌట్, 4 ఫోర్లు) లు రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. ఏడు వికెట్లు కోల్పోయి 376 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఓవర్ నైట్ స్కోరు 98/1 వద్ద రెండో రోజు ఆరంభించిన భారత్.. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంది. స్నేహ్ రాణా (9) పరుగులు చేయకపోయినా మంధానకు అండగా నిలిచింది. అర్థ సెంచరీ సాధించిన మంధాన.. 106 బంతుల్లో 12 బౌండరీల సాయంతో 74 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు స్నేహ్ రాణా – మంధానలు 50 పరుగులు జోడించారు. ఆసీస్ స్పిన్నర్ ఆష్లే గార్డ్నర్ ఈ జోడీని విడదీసింది. స్నేహ్ రాణాను బౌల్డ్ చేసిన ఆమె.. తర్వాత కూడా కీలక వికెట్లు పడగొట్టింది. మంధాన గార్డ్నర్ వేసిన 39వ ఓవర్లో రనౌట్ అయింది.
రిచా-జెమీమా భాగస్వామ్యం..
147 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను రిచా ఘోష్ – జెమీమాలు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ గార్డ్నర్తో పాటు ఆసీస్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. అలానా కింగ్, జొనాసెన్, గార్డ్నర్ లను మార్చి మార్చి ప్రయోగించినా ఈ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయారు. మూడో వికెట్‌కు రిచా-జెమీమా జోడి 113 పరుగులు జతచేశారు. అయితే కిమ్ గార్త్.. రిచాను ఔట్ చేయడంతో భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ డకౌట్ కాగా యస్తికా భాటియా ఒక్క పరుగు మాత్రమే చేసింది. జెమీమా కూడా నిష్క్రమించడంతో భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. 15 పరుగుల వ్యవధిలో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.
Second Test fifty in as many Tests 👏
Another composed batting display 👍With 7⃣3⃣ runs against Australia, @JemiRodrigues impressed yet again with the bat 👌 👌 #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank
Watch Her Knock 🎥 🔽
— BCCI Women (@BCCIWomen) December 22, 2023
నిలబడ్డ దీప్తి-పూజ
గార్డ్నర్ విజృంభిస్తుండటంతో భారత లోయరార్డర్ కూడా పెవిలియన్ చేరుతుందని ఆశించిన ఆసీస్ ఆటగాళ్లకు స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ, పేస్ ఆల్ రౌండర్ పూజా వస్త్రకార్లు చుక్కలు చూపించారు. ఈ ఇద్దరూ వికెట్ ఇచ్చేదే లేదన్నట్టుగా పట్టుబట్టి క్రీజులో నిలిచారు. ఎనిమిదో వికెట్‌కు ఇప్పటికే అజేయంగా 242 బంతుల్లో 102 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ రాణించడంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంతి టర్న్ అయితే అప్పుడు ఆసీస్‌కు ఈ స్కోరు చేయడం సైతం కష్టమే.. దీప్తి-పూజలు ఇదే పట్టుదలను మూడో రోజు లంచ్ వరకూ కొనసాగిస్తే మాత్రం ఆస్ట్రేలియాపై టెస్టులలో భారత్‌కు స్వదేశంలో చిరస్మరణీయ విజయానికి బాటలు వేసుకున్నట్టే…!
Another excellent day on the field! 👏
Deepti Sharma (70*) & Pooja Vastrakar (33*) take #TeamIndia to 376-7, with a first innings lead of 157 runs at the end of Day 2 💪
Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/1cooBBvnZy
— BCCI Women (@BCCIWomen) December 22, 2023