Old Trafford : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో వెనకంజ వేసిన టీమిండియా ఓల్ట్ ట్రఫోర్డ్ (Old Trafford)లో విజయం సాధిస్తేనే సిరీస్ సమం చేస్తుంది. అయితే.. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు అక్కడి పరిస్థితులే కాదు గత రికార్డులు కూడా సవాళ్లు విసరుతున్నాయి. అవును.. ఈ మైదానంలో గత తొమ్మిది మ్యాచుల్లో ఒక్కదాంట్లోనూ ఇండియా గెలుపొందలేదు. నాలుగు టెస్టుల్లో ఆతిథ్య జట్టు జయకేతనం ఎగురవేయగా.. భారత్ నాలుగింటిని డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో లార్డ్స్ ఓటమి నుంచి తేరుకొని శుభ్‌మన్ గిల్ సేన పంజా విసిరితే తప్ప సిరీస్‌ను కాపాడుకోవడం కష్టం.
రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో 2007లో ఇంగ్లండ్ గడ్డపై చివరిసారిగా భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇలా ఎందరో కెప్టెన్లు మారినా పరాజయమే పలకరించింది. కానీ, గత రికార్డులను చెరిపేస్తూ..బర్మింగ్హమ్లో చరిత్రాత్మక విజయంతో రికార్డులు నెలకొల్పిన గిల్ బృందం చేజేతులా లార్డ్స్‌లో ఓడిపోయింది.
Venue Stats👇🏻
9 matches. 89 years. The wait has been long… but history is calling at Old Trafford! 🇮🇳✨
Can Team India turn the tide and script a famous victory?#TeamIndia #INDvsENG #OldTrafford@BCCI @ICC pic.twitter.com/8lMgGVzOJR— Doordarshan Sports (@ddsportschannel) July 21, 2025
ప్రస్తుతం టెస్టు సిరీస్‌లో 2-1తో వెనబడిన టీమిండియాకు ఓల్డ్ ట్రఫోర్డ్ మ్యాచ్ చావోరేవో లాంటిది. అయితే.. గత రికార్డులు మాత్రం అనుకూలంగా లేవు. ఎందుకంటే.. భారత్ ఒక టెస్టు సిరీస్‌లో 2-1తో వెనుకంజలో ఉన్న ప్రతిసారి ప్రత్యర్థికి తలొగ్గింది. గెలవడం కాదు కదా కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయింది. అందుకే.. ఈసారి కూడా ట్రోఫీ పోయినట్టేనా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, గిల్ నేతృత్వంలోని భారత జట్టు మాత్రం ఎలాగైనా బెన్ స్టోక్స్ జట్టుకు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.
India have never won/drawn a series after being 2-1 down
Only thrice has a team won a five-match Test series being 2-1 or 1-0 down after the third match of the series:
◾ ENG vs SA in ENG after being 0-1 down (1998)
◾ WI vs AUS in AUS after being 0-1 down (1992/93)
◾ AUS vs… pic.twitter.com/vdwkANtW34— ESPNcricinfo (@ESPNcricinfo) July 21, 2025
గతంలో ఇంగ్లండ్(1998), ఆస్ట్రేలియా(1992-93, 1936-37) మాత్రమే 2-1తో వెనకబడినా పుంజుకొని విజేతగా అవతరించాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జూలై 23న నాలుగో టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep), ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (Nitish Reddy) అందుబాటులో లేరు. దాంతో జట్టు కూర్పు కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్‌కు తలనొప్పిగా మారింది.