Graham Thorpe: ఇంగ్లండ్‌లోని సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ కీలక నిర్ణయం తీసుకుంది. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టుకు వేదికైన ఓవల్ మైదానంలో గ్రాహమ్ థోర్ఫ్ (Graham Thorpe)ను స్మరించుకోనుంది. ఆట రెండో రోజును పూర్తిగా ఈ దిగ్గజ ఆటగాడికి అంకితం చేయనుంది ఈసీబీ. తమ జట్టుకు, ఇంగ్లండ్‌కు విశేష సేవలందించిన దివంగత థోర్ప్ జ్ఞాపకార్థంగా రెండో రోజు మ్యాచ్‌కు ముందు అతడి జీవితాన్ని, క్రికెటర్‌గా అతడి ప్రయాణాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. గుర్తు చేసుకోనుంది. ఈ విషయాన్ని సర్రే క్రికెట్ క్లబ్ సోమవారం వెల్లడించింది.
‘భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగబోయే ఐదో టెస్టులో సర్రే జట్టు మాజీ ఆటగాడైన థోర్ఫ్ను స్మరించుకుంటాం. ఓవల్‌లో రెండో రోజైన ఆగస్టు 1న ఆ దిగ్గజ క్రికెటర్‌కు నివాళులు అర్పించిన తర్వాత.. అతడి జీవిత విశేషాలను ఈసీబీ, సర్రే క్లబ్ యాది చేసుకుంటాయి. మెంటల్ హెల్త్ ఛారిటీ మైండ్ అనే ఎన్జీవో సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే అరోజు థోర్ప్ 55వ జయంతి’ అని సర్రే కౌంటీ క్లబ్ వెల్లడించింది.
A Day for Thorpey 🤎
We’ll be celebrating the life of Graham Thorpe on Day 2 of the 5th Test Match at the Kia Oval.
Working with Graham’s wife Amanda, and her daughters, we’re supporting Mind to raise funds and awareness of those struggling with their mental wellbeing.
Read… pic.twitter.com/LAcv6yi4Pu
— Surrey Cricket (@surreycricket) July 21, 2025
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిరుడు ఆగస్టు 4న అనుమానాస్పద రీతిలో మరణించాడు. కొందరేమో ఆయనది సహజమరణం అని చెప్పగా.. కాదు కాదు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడని ఆయన భార్య అమంద (Amanda) షాకింగ్ కామెంట్స్ చేసింది. న్యాయ విచారణలో థోర్ప్ గురించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఓ రైలు ప్రమాదంలో కన్నుమూశాడని బ్రిటన్ మీడియాకు కోర్టు తెలిపింది.
”సర్రేలో థోర్ప్ ఒక రైలు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. ఎషెర్ రైల్వే స్టేషన్ (Esher Railway Station)లో ఆయనను రైలు ఢీకొట్టింది. దాంతో, ఆయన అక్కడే మృతి చెందాడు’ అని మంగళవారం సర్రేలోని కార్నర్స్ కోర్టు వెల్లడించింది. ఇక బ్రిటన్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ .. ‘మాకు ఎషెర్ రైల్వే స్టేషన్ నుంచి ఆగస్టు 4 ఉదయం 8:26 గంటలకు ఓ ఫోన్ వచ్చింది. ఓ వ్యక్తి తీవ్రగాయాలతో పట్టాల మీద పడిఉన్నాడని ఆ ఫోన్ సారాంశం. అప్పటికే అక్కడకు చేరుకున్న వైద్యులు అతడిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆయన చనిపోయాడని వాళ్లు చెప్పారు. మేమైతే అతడిది అనుమానాస్పద మృతి అని రికార్డు చేయలేదు’ అని చెప్పాడు.
థోర్ప్ 1993 నుంచి 2005 మధ్య ఇంగ్లండ్ జట్టుకు ఆడాడు వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులలో 44.66 సగటుతో 6,774 పరుగులు చేయగా వన్డేలలో 2,830 రన్స్ సాధించారు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాక కొన్నాళ్లపాటు అఫ్గానిస్థాన్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేశారు.