Hockey Pro League : యూరప్ గడ్డపై జరుగుతున్న హాకీ ప్రో లీగ్ (Hockey Pro League)లో భారత జట్టు ఆరో ఓటమి ఎదురైంది. ఇప్పటికే నెదర్లాండ్స్, అర్జెంటీనా చేతిలో పరాజయంతో కుమిలిపోతున్న టీమిండియా.. ఆస్ట్రేలియా (Australia) చేతిలో వరుసగా రెండో ఓటమిని చవి చూసింది. గత పోరులో ఆఖర్లో గోల్స్ సమర్పించుకున్న భారత్.. ఈసారి ప్రత్యర్థిని నిలువరించలేక మళ్లీ విజయం వాకిట బొక్కబోర్లాపడింది. శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ సింగ్ సేన 2-3తో వెనకబడింది.
గత మ్యాచ్‌లో మాదిరిగానే భారత ఆటగాళ్లు తొలి అర్ధ భాగంలోనే గోల్ సాధించారు. డిఫెండర్ సంజయ్ రానా (Sanjay Rana) 3వ నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్ అందించాడు. కానీ, ఆ తర్వాత ఆసీస్ ఆటగాళ్లు టిమ్ బ్రాండ్ (4వ నిమిషం), బ్లేక్ గోవర్స్ 5 వ నిమిషంలో గోల్స్ చేయగా భారత్ వెనకబడింది. అయితే.. దిల్‌ప్రీత్ సింగ్ 36వ నిమిషంలో గోల్ చేయగా టీమిండియా 2-2తో స్కోర్ సమం చేసింది. దాంతో ‘హమ్మయ్య మ్యాచ్‌ను కాపాడుకుంటాం’ అని హర్మన్‌ప్రీత్ సేన ధీమాగా ఉన్న వేళ.. భారత డిఫెండర్లను ఏమారుస్తూ కూపర్ బర్న్స్(36 నిమిషం) గోల్‌తో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Full-Time!
A spirited showing from the Men in Blue, with early intent and goals from Sanjay and Dilpreet Singh keeping us in the hunt.Despite a late push, Australia take this one by a narrow margin.
A performance full of grit, and plenty to build on.India 🇮🇳 2 – 3 🇦🇺… pic.twitter.com/C24TEKUdv7
— Hockey India (@TheHockeyIndia) June 15, 2025
27వ నిమిషంలో టీమిండియాకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. కానీ.. వాటిని హర్మన్‌ప్రీత్ బృందం సద్వినియోగం చేసుకోలేకపోయింది. 400వ మ్యాచ్ ఆడుతున్న మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తీవ్రంగా నిరాశపరిచాడు. మరో 10 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆసీస్ ఆటగాళ్లు రెండు పెనాల్టీ కార్నర్లు సాధించారు. అయితే.. గోల్ కీపర్ పాఠక్ వాటిని సమర్ధంగా అడ్డుకోవడంతో ఒక్క పాయింట్ తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది.వరుసగా ఆరు ఓటములతో డీలాపడిన టీమిండి తదుపరి మ్యాచ్‌లో జూన్ 21న బెల్జియంతో తలపడనుంది.