Sam- Chai | ఘాడంగా ప్రేమించుకొని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత అనుకోని కారణాల వలన పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. వీరి విడాకుల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారు, మళ్లీ కలిస్తే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత కలిసింది లేదు, మాట్లాడుకుంది లేదు. ఇక సమంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్య.. శోభిత దూళిపాళ్లని వివాహం చేసుకోగా, సమంత.. రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉందనే టాక్ నడుస్తుంది.
అయితే ఇన్నేళ్లకి సమంత-నాగ చైతన్య కలవబోతున్నారంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. నాగ చైతన్య- సమంత జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఏ మాయ చేశావే చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మూవీ విడుదలై 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా . జులై 18న థియేటర్స్ లో గ్రాండ్ రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం చై- సామ్ మళ్ళీ కలుస్తారా? అనే చర్చ మొదలైంది. ఈ చిత్రంతోనే సమంత కథానాయికగా ఆరంగేట్రం చేసింది. గౌతమ్ మీనన్ సామ్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. తన క్యూట్ లుక్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది సమంత. ఇక ఇదే చిత్రంతో రొమాంటిక్ లవర్ బోయ్ గా చైతూకి సరికొత్త ఇమేజ్ వచ్చింది.
ఈ చిత్రం ఇద్దరికి చాలా స్పెషల్ అని పలు సందర్భాలలో వారు చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ మూవీ షూటింగ్ టైంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డట్టు సమాచారం. సమంత తన వీపుపై ఈ సినిమాకి, తమ ప్రేమకి గుర్తుగా వైఎంసీ అనే టాటూ కూడా వేయించుకుంది. మరి ఇద్దరికి అంత స్పెషల్ అయిన ఏ మాయ చేశావే చిత్ర రీరిలీజ్ అవుతున్న సందర్భంగా వారు కలిసి ప్రమోట్ చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దాదాపు కుదరకపోవొచ్చని కొందరి అభిప్రాయం . కనీసం ఈ సినిమా ద్వారా చై- సామ్ లని మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం లభిస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.