Indian Womens Team : భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. నాలుగో టీ20లో చిరస్మరణీయ విజయంతో ఇంగ్లండ్ (England) గడ్డపై తొలిసారి సిరీస్ విజేతగా అవతరించింది టీమిండియా. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి మరో మ్యాచ్ ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తెలుగమ్మాయి శ్రీచరణి (2/30), ఆల్‌రౌండర్ రాధా యాదవ్(2/15).. షఫాలీ వర్మ(32) భారత జట్టు అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇంగ్లండ్ గడ్డపై పురుషుల జట్టు సంచలన ప్రదర్శనతో ఔరా అనిపిస్తుంటే.. మహిళల టీమ్ సైతం అదరహో అనిపించింది. 2006లో చివరిసారిగా టీ20లో ఆతిథ్య జట్టును ఓడించిన భారత్.. 19 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు విక్టరీలతో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన టీమిండియా నిర్ణయాత్మక నాలుగో టీ20లోనూ పంజా విసిరింది.
Delight in the air 🥳#TeamIndia‘s joyous moments after completing a 6 wicket win over England and sealing the #ENGvIND T20I series 🤝 pic.twitter.com/KpKycyuB3H
— BCCI Women (@BCCIWomen) July 10, 2025
మూడో టీ20లో గెలుపొందిన ఇంగ్లండ్ అదే జోరును కొనసాగించలేకపోయింది. స్పిన్నర్లు రాధా యాదవ్(2/15), శ్రీచరణి (2/30)లు తిప్పేయగా ప్రత్యర్థి 127కే పరిమితమైంది. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు షఫాలీ వర్మ(32), స్మృతి మంధాన(31)లు ధనాధన్ ఆడారు. తొలి వికెట్‌కు 56 పరుగులు రాబట్టడంతో ఇంగ్లండ్ బౌలర్లు బిక్కమొహం వేశారు. వీళ్లిద్దరూ ఔటయ్యాక జెమీమా రోడ్రిగ్స్(24 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(26)లు జట్టును విజయతీరాలకు చేర్చారు.
Innings Break!
2️⃣ wickets each for Shree Charani and Radha Yadav
1️⃣ wicket each for Amanjot Kaur and Deepti Sharma#TeamIndia need to successfully chase 127 to take an unassailable lead in the series 👍Updates ▶️ https://t.co/QF3qAMduOx#ENGvIND pic.twitter.com/UTnYhk703d
— BCCI Women (@BCCIWomen) July 9, 2025
‘చరిత్రలో నిలిచిపోయే సిరీస్ విజయం పట్ల సంతోషంగా ఉన్నా. మా జట్టులోని ప్రతి ఒక్కరి ప్రదర్శన పట్ల నేనెంతో గర్వపడుతున్నా. ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించడం మాకు ఎంతో ఉపయోగపడింది. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రతిఒక్కరం కష్టంపడ్డాం. అనుకున్నట్టే మా వ్యూహాలను అమలుచేసి.. సమిష్టిగా రాణించాం. వచ్చే ఏడాది ఇక్కడే టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాం. కచ్చితంగా ఈ సిరీస్ విజయం మాలో స్ఫూర్తి నింపుతుంది’ అని మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. నామమాత్రమైన ఐదో టీ20 జూలై 12న జరుగనుంది. అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి.