Legends League Cricket : క్రికెట్ అభిమానులను రంజింపజేసేందుకు మరో లీగ్ సిద్ధమవుతోంది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకటైన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legends League Cricket) నాలుగో సీజన్ త్వరలోనే షురూ కానుంది. గురువారం ఎల్ఎల్సీ లీగ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆటను ఎంతగానో ఆదరించే భారత్ వేదికగా నవంబర్ 19 న ఈ మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్ల మెరుపులతో కళకళలాడే ఈ క్రీడా సంబురం డిసెంబర్ 13 వరకూ జరుగనుంది. బోల్డర్, బిగ్గర్, బ్రైటర్ అనే థీమ్‌తో నాలుగో సీజన్‌ను నిర్వహించనున్నారు.
‘లెజెండ్ క్రికెట్ లీగ్ నాలుగో సీజన్ షెడ్యూల్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి అభిమానులను మరింతగా అలరించడం కోసం మ్యాచ్‌ల సంఖ్యను పెంచుతున్నాం. అలానే ఈ ఎడిషన్‌లో వేదికల సంఖ్య కూడా పెరగనుంది. అంతేకాదు భారీగా అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు ఈ టోర్నీలో తళుక్కుమనేందుకు సిద్ధమవుతున్నారు. చెప్పాలంటే ఇదొక క్రీడా పండుగను తలపించనుంది. ఈ లీగ్ నిర్వహణతో భారత దేశం పేరును మరోసారి విశ్వవ్యాప్తం చేద్దాం’ అని ఎల్ఎల్సీ లీగ్ ఛైర్మన్ వివేక్ ఖుషలానీ (Vivek Khushalani) తెలిపాడు.
The legends return! Season 4 of #LLCT20 brings your favourite cricket legends back to the pitch, bigger, better, brighter, bolder, and better than ever. Are you ready to witness history in the making?
Stay tuned for fixtures & updates.#LegendsLeagueCricket #CricketLegends… pic.twitter.com/SOmC7vmRHs
— Legends League Cricket (@llct20) July 10, 2025
ఈసారి భారత్‌లోని పలు పట్టణాల్లో లీగ్‌ను జరిపేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే.. మ్యాచ్‌ల వేదికలను త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఈసారి కూడా సూపర్ స్టార్లతో నిండిన బిల్వరా కింగ్స్, గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్‌స్టార్స్, అర్బన్‌రైజర్స్ హైదరాబాద్(Urbanrisers Hyderabad) జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.
All heart. All hustle. All theirs. 🔥@SSuper_Stars winners of #LLCseason3 💥
Kaisa laga humare Legends Ka Jalwa ❤️#SSSvKSO #BossLogonKaGame #LegendsKaJalwa #LLCT20 #Srinagar pic.twitter.com/UOnwHyOEcx
— Legends League Cricket (@llct20) October 16, 2024
ఎల్ఎల్సీ మూడో సీజన్లో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, మార్టిన్ గుఫ్టిల్, గౌతం గంభీర్, క్రిస్ గేల్, హషీం అమ్లా, రాస్ టేలర్ వంటి వెటరన్స్ తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను ఖుషీ చేశారు. ఈసారి కూడా అదే జోష్‌తో చెలరేగిపోవాలని అనుకుంటున్నారీ లెజెండరీ ప్లేయర్స్.