లక్నో: యూపీలో విషాద ఘటన జరిగింది. అప్పుల్లో ఉన్న ఓ వ్యాపారి.. సూసైడ్ చేసుకున్నాడు. లక్నోలో అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తలలో తుపాకీతో కాల్చుకున్నాడు. దానికి ముందు అతను తన బాధను ఫేస్బుక్(Facebook Live) వీడియోలో పంచుకున్నాడు. తన నిస్సహాయ స్థితిని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. డయాబెటిక్‌తో బాధపడుతున్న కూతురికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనే సామర్థ్యంలేకుండా పోయిందని ఆవేదన పడ్డాడు . ఈ ఘటన బుధవారం జరిగింది.
36 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెక్యూర్టీ లైసెన్స్ ఉన్న 12 బోర్ గన్‌తో అతను కాల్చుకున్నాడు. బలవన్మరణానికి ముందు అతను తన ఫేస్బుక్ వీడియోలో అందర్నీ వేడుకున్నాడు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు.. తన కుటుంబాన్ని ఆదుకోవాలన్నాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. తనకు 15 కోట్ల అప్పు ఉందని, ఓ వ్యాపార భాగస్వామి తనను తీవ్రంగా వేధిస్తున్నట్లు అతను ఆరోపించాడు.
డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్న తన కూతుర్ని ఇన్సులిన్ ఇవ్వలేకపోతున్నట్లు అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఫేస్బుక్ లైవ్ వీడియో చూసి ఫ్యామిలీ సభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే స్పాట్‌కు వెళ్లే సరికి అతను షూట్ చేసుకుని చనిపోయాడు.