దేవరకొండ రూరల్, జులై 10 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 20న నల్లగొండ జిల్లా దేవరకొండ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను పురస్కరించుకుని హెలీప్యాడ్ స్థలాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గురువారం దేవరకొండ ఏఎస్పీ మౌనిక, ఆర్డీఓ రమణా రెడ్డి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు.