ఆలేరు టౌన్, జులై 10 : గత బీఆర్ఎఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల పట్టాలకు, ప్లాట్లను పంపిణీ చేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండీ కుర్షిద్ పాషా అన్నారు. ఈ మేరకు గురువారం ఆలేరు డిప్యూటీ తాసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విలేకరుల కోసం సర్వే నంబర్ 1026లో ఎకరం స్థలం కేటాయించినట్లు చెప్పారు. విలేకరులకు పట్టాలు ఇచ్చారు కానీ, లేఔటు చేసి ప్లాట్లు పంపిణీ చేయలేదన్నారు. ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో ప్లాట్ల పంపిణీ ఆగిపోయిందని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకుని అర్హులైన విలేకరులను గుర్తించి లే అవుట్ చేసి, ప్లాట్లను పంపిణీ చేసి, ఆ ఫ్లాట్లలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, వెంకటేశ్వర్లు, రవి, మల్లయ్య, నరేశ్, స్వామి, మల్లేశ్, శివకుమార్, మధు, మహేందర్, శ్రవణ్ కుమార్, జాంగిర్, సిద్ధార్థ పాల్గొన్నారు.