IPL Mega Auciton : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం (IPL Mega Auciton) మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. సౌదీ అరేబియాలోని ‘జెడ్డా'(Jeddah) నగరంలో ఆక్షనీర్ వేలం పాట అందుకోనున్నారు. ఇప్పటికే జెడ్డా చేరుకున్న పది ఫ్రాంచైజీల యజమానులు గెలుపు గుర్రాలను కొనే పనిలో నిమగ్నమయ్యారు. 17వ సీజన్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు ఆ రికార్డు బద్ధలు కొట్టే కోటీశ్వరుడు ఎవరు? అనే ఆసక్తి కోట్లాదిమందిలో ఉంది.
పద్దెనిమిదో సీజన్‌కు జరుగుతున్న ఈ మెగా వేలంపై అందరి కండ్లు నిలిచాయి. ప్రతి మూడేండ్లకు ఓసారి స్క్వాడ్‌ను మార్చుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. భారతీయ కాలమానం ప్రకారం నవంబర్ 24వ తేదీ ఉదయం 7:50 గంటలకు పెర్త్ టెస్టు ప్రారంభం కానుండగా.. మధ్నాహ్నం 3:30 గంటలకు జెడ్డాలో మెగా వేలం మొదలవ్వనుంది. రెండో రోజైన నవంబర్ 25న కూడా అదే సమయానికి ఆక్షనీర్ కనీస ధరను బట్టి క్రికెటర్ల పేర్లను చదువనుంది.
Schedule of 24TH NOVEMBER, SUNDAY:
7.50am to 3.20pm – Day 3 in Perth.
3.30pm onwards – IPL auction.#INDvsAUS #IPLAuction pic.twitter.com/CnI1vedmZ6
— IPL Auction 2025 🧢 (@IPL2025Auction) November 23, 2024
Tomorrow’s the day. The plan’s in place. 🏏🔥
Get ready, Orange Army 🧡#IPL2025 #IPLAuction #SRH pic.twitter.com/iEEO04Xutj
— Kavya Maran SRH (@KavyaMaranOffcl) November 23, 2024
మెగా వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వీళ్లలో రిషభ్ పంత్(Rishabh Pant), కేఎల్ రాహుల్(KL Rahul), ఇషాన్ కిషన్(Ishan Kishan), జోస్ బట్లర్(Jos Buttler), ఫిల్ సాల్ట్(Phil Salt).. ఈ నలుగురు వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యే వీలుంది. వికెట్ కీపర్‌గా, విధ్వంసక బ్యాటర్‌గా..
రెండు విధాలా పనికొచ్చే ఈ ఐదుగురిలో ఒక్కొక్కరికోసం ఫ్రాంచైజీలు పోటీపడడం ఖాయం. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వస్తున్న పంత్, రాహుల్, బట్లర్, సాల్ట్‌లకు భారీ ధర దక్కడం మాత్రం పక్కా. ఇక 17వ సీజన్లో కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా భారీ డిమాండ్ ఉంది.
ఐపీఎల్ మెగా వేలంలో 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ, చివరకు వడబోత అనంతరం 574 మంది మాత్రమే వేలం పాటలో నిలిచారు. వీళ్లలో 81 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల కనీస ధర పలుకుతున్నారు. మొత్తంగా 574 మంది క్రికెటర్లలో భారతీయులు 366 మంది (48 మంది అన్క్యాప్డ్తో కలిపి) ఉండడం విశేషం. ఇక విదేశీ ఆటగాళ్లు 208 మంది.. 193 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లతో పాటు అనుబంధ దేశాలకు చెందిన 12 మంది వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
How it started, How is it going 💛#WhistlePodu #CSK #IPLAuction
📸 @ChennaiIPL pic.twitter.com/o9r7kZCNP8— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) November 21, 2024
కనీస ధర రూ. 2 కోట్లు : రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, చాహల్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, టి.నటరాజన్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, సిరాజ్, ఉమేశ్ యాదవ్.
పంజాబ్ కింగ్స్ – 110.5 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – 83 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ – 73 కోట్లు, గుజరాత్ టైటాన్స్ – 69 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ – 69 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ – 55 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ – 51 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ – 45 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ – 41 కోట్లు, ముంబై ఇండియన్స్ – 45 కోట్లు.