Singareni | సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన దీపావళి బోనస్ రూ.18.27కోట్లు ఈ నెల 27న ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య పని చేసి రిటైర్డ్ అయిన కార్మికులకు సంబంధించి పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీమ్ (దీపావళి బోనస్) సొమ్మును విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27న ఆయా కార్మికుల ఖాతాల్లో దీపావళి బోనస్ జమవుతుందని సీఎండీ ఒక ప్రకటనలో వెల్లడించారు. దాదాపు 2,754 మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,750 చొప్పున మొత్తంగా రూ.18.27కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న రిటైర్డ్ కార్మికుల ఖాతాల్లో జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, సిబ్బంది వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.