MLC Kavitha | ఆ పిల్లల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
MLC Kavitha | ప్రభుత్వ పాఠశాలల్లో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్డల ప్రాణాలను ప్రాధాన్యతగల అంశంగా స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha | ప్రభుత్వ పాఠశాలల్లో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్డల ప్రాణాలను ప్రాధాన్యతగల అంశంగా స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ ఒక్క పాఠశాలను చూసినా ఏదో ఒక సంఘటన జరిగిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. మరణించిన 42 మంది పిల్లల కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను శనివారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ… తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్టు ఉండటం సరికాదని సూచించారు.
“ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, సగటున నెలకు ముగ్గురు చొప్పున ఇప్పటి వరకు 42 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆహారం విషతుల్యమై మరణించారు. సగటున పదిరోజులకు ఒక పసి ప్రాణాన్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సంక్షేమ శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్ద ఉండటం వల్ల సమయం వెచ్చించలేకపోతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. కనీసం పది నిమిషాల సమయాన్ని కేటాయించి సమీక్ష చేస్తే పసి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుందని సూచించారు.
నారాయణపేట హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా పిల్లలు అనారోగ్యం పాలైన తర్వాత ముఖ్యమంత్రి సమీక్ష చేసిన మరునాడే అలాంటి మరో సంఘటన జరగడం ఆందోళనకరమని అన్నారు. పిల్లలు కూడా ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఐఐటీ, ఐఐఎంకు వెళ్లాలా లేకపోతే ఎవరెస్టు అధిరోహించాలా అన్న ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలతో వెళ్లిన సందర్భాన్ని తెలంగాణ సమాజం చూసిందని గుర్తు చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థిని శైలజ ఇంకా వెంటిలేటర్ పైనే ఉంది.
ఈ పదకొండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్ల ఇప్పటికే 42 మంది ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పది… pic.twitter.com/rmuCxtiG77
— BRS Party (@BRSparty) November 23, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

