ISSF World Cup : భారత యువ షూటర్ ఎలవేనిల్ వలరివన్ (Elavenil Valarivan) ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో కాంస్యం కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ ఫైనల్లో పసిడిపై గురి పెట్టిన తను చివరకు కంచుమోత మోగించింది. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా క్వాలిఫికేషన్ రౌండ్లో అదరగొట్టిన 25 ఏళ్ల ఈ యువకెరటం స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అయితే.. 231.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
తమిళనాడుకు చెందిన ఎలవేనిల్ వలరివన్ 2018 వరల్డ్ కప్లో నాలుగో స్థానంతో నిరాశపరిచింది. అయితే.. మ్యూనిచ్ ఆతిథ్యం ఇస్తున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తోంది. క్వాలిఫికేషన్ రౌండ్లో సత్తా చాటిన తను ఫైనల్లో తొలి షాట్లోనే 10.7 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత 10.8 పాయింట్లు రాబట్టింది. దాంతో, రజతం వస్తుందని ఆశించింది. కానీ, కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Kudos to our very talented Elavenil Valarivan for setting a # National record in the qualification round of the women’s 10m Air Rifle, scoring 635.9 at ISSF World Cup, Munich.
Way to go, Elavenil!👏🏻#Sports #WorldCup #GameOn pic.twitter.com/GRnsUshSsA
— SAI Media (@Media_SAI) June 10, 2025
అయితే.. రెండుసార్లు ఒలింపిక్స్లో పోటీ పడిన వలరివన్ .. కొరియా షూటర్ క్వాన్ యుంజీ కంటే 0.3 పాయింట్లు మాత్రమే వెనకబడింది. లేదంటే ఆమె ఖాతాలో సిల్వర్ మెడల్ చేరేది. ఫైనల్లో చైనీస్ షూటర్ వాంగ్ జీఫీ పసిడి పతకం గెలుపొందగా.. క్వాన్ను రజతం వరించింది.