నల్లగొండ రూరల్, జూన్ 10 : హకింపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుండి ఆన్లైన్లో tqss.telangana.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ అయి విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
మండల స్థాయి ఎంపికలు – తేదీలు: 16-06-2025 నుంచి 19-06-2025 వరకు
జిల్లా స్థాయి ఎంపికలు – తేదీలు : 24-06-2025, బాలికలకు ,25-06-2025 బాలురకు ఉదయం 8.00 గంటల నుండి సెలెక్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
స్థలం : మేకల అభినవ్ స్టేడియం, నల్లగొండ
ప్రవేశం కోరే విద్యార్థులు 01-09-2016 నుండి 31-08-2017 మధ్య జన్మించి ఉండాలి. జిల్లా స్థాయి ఎంపికలకు హాజరవుతున్న బాలబాలికలు తప్పనిసరిగా ఈ క్రింది పత్రాలు వెంట తీసుకురావాలి.
– ప్రస్తుత పాఠశాల నుంచి పొందిన బోనఫైడ్ సర్టిఫికెట్
– తాసీల్దార్ / పంచాయతీ / మున్సిపాలిటీ / కార్పొరేషన్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం
– పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు – 8
– 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ కాపీలు
– ఆధార్ కార్డ్ (ఒరిజినల్)
– కుల ధృవీకరణ పత్రం
ఎంపిక పూర్తిగా దేహదారుఢ్యంకి సంబంధించినది. 30 మీటర్లు ఫ్లయింగ్ స్టార్స్, 800 మీటర్లు పరుగు, 6×10 షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్థికల్ జంప్ ఫ్లెక్సిబులిటీ టెస్ట్ , ఎత్తు, బరువు, మొత్తం తొమ్మిది విభాగాల్లో 27 మార్కులకు గాను ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
గమనిక : ఎంపికల కోసం హాజరయ్యే విద్యార్థులకు TA/DA చెల్లించబడదు.
ఇతర వివరాల కోసం జిల్లా యువజన మరియు క్రీడల అధికారి.కె.నర్సిరెడ్డి మొబైల్ 9440072854 నంబరులో సంప్రదించవచ్చు.