ఖమ్మం రూరల్, జూన్ 10 : అంగన్వాడీ కేంద్రాల పునఃప్రారంభ వేడుకలు ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం సంబురంగా జరిగాయి. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఐసీడీఎస్ సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ వేడుకలు జరగడంతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గుర్రాలపాడు అంగన్వాడీ కేంద్రంలో జరిగిన వేడుకకు జిల్లా సంక్షేమ అధికారి రామ్ గోపాల్ రెడ్డి, ఐసీడీఎస్ ఖమ్మం రూరల్ ప్రాజెక్టు అధికారి కమల ప్రియ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్రానికి నూతనంగా వచ్చిన పిల్లలకు అధికారులు స్వాగతం పలికారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో అమల్లోకి రాబోతున్న ఎగ్ బిర్యాని వంటకం రుచి చూపించారు. ఆటపాటలతో కూడిన బోధన అంశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అంగన్వాడీ కేంద్రంలో సెల్ఫీ విత్ చైల్డ్ ప్రోగ్రాంలో భాగంగా చిన్నారులతో సరదాగా సెల్ఫీలు దిగారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి పిల్లల తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ జ్యోతి, హెల్పర్ నీలిమ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Khammam Rural : ఆకట్టుకున్న సెల్ఫీ విత్ చైల్డ్
Khammam Rural : ఆకట్టుకున్న సెల్ఫీ విత్ చైల్డ్