Mohammaad Siraj : శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టుకు పెద్ద షాక్. లంకపై ఘనమైన రికార్డు కలిగిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammaad Siraj) గాయపడ్డాడు. గురువారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో బంతి సిరాజ్ ఎడమ కాలికి బలంగా తాకింది. దాంతో, అతడు నొప్పితో విలవిలలాడాడు.
గాయపడిన సిరాజ్‌కు ఫీజియో మైదానంలోనే ట్రీట్మెంట్ చేశాడు. ఆ తర్వాత ఈ స్పీడ్‌స్టర్ కాస్త రిలాక్స్‌గా కనిపించాడు. అయితే.. శనివారం జరుగనున్న తొలి టీ20లో ఈ స్పీడ్‌స్టర్ ఆడుతాడా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.
As per reports, Mohammed Siraj is getting medical attention after being hit by a ball on his leg, the pacer looks in pain.#MohdSiraj #IndianCricket #SLvIND #Insidesport #CricketTwitter pic.twitter.com/on78oGbD1M
— InsideSport (@InsideSportIND) July 25, 2024
ఒకవేళ  శనివారం లోపు సిరాజ్ ఫిట్‌గా మారకుంటే రెండో ఖలీల్ అహ్మద్ తుది జట్టులో ఉండే అవకాశముంది. అయితే.. తుది జట్టుపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు నిర్ణయం తీసుకోనున్నారు.  టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన యువపేసర్ అర్ష్‌దీప్, ఖలీల్‌లు బౌలింగ్ యూనిట్‌ను నడిపిస్తారు.  లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ తాజాగా జింబాబ్వే పర్యటనలో పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
భారత టీ20 బృందం : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, సిరాజ్.