ICC : క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా పరిగణించే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) హద్దు మీరిన ఆటగాళ్లకు జరిమానాలు విధిస్తుంటుంది. ఈ క్రమంలోనే భారత ఓపెనర్ ప్రతికా రావల్ (Pratika Rawal)కు ఐసీసీ షాకిచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఓపెనర్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా వేసింది. అంతటితోనే సరిపెట్టకుండా ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. నాట్ సీవర్ బ్రంట్ నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు కూడా భారీ ఫైన్ పడింది. స్లో ఓవర్ రేటు కారణంగా జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించింది ఐసీసీ.
జూలై 17న బర్మింగ్హమ్లో జరిగిన వన్డేలో ప్రతికా మైదానంలో రెండుసార్లు ఐసీసీ కోడ్‌ను ఉల్లంఘించింది. 18వ ఓవర్లో సింగిల్ తీసే క్రమంలో ఇంగ్లండ్ బౌలర్ లారెన్ ఫిలెర్ (Lauren Filer)ను ఢీకొట్టింది. 36 పరుగుల వద్ద ఔటైనా ప్రతీకా కోపాన్ని నియంత్రించుకోలేక సోఫీ ఎకిల్‌స్టోన్‌తో వాగ్వాదానికి దిగింది. దాంతో, రెండు పర్యాయాలు ఐసీసీ నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన విషయాన్ని మ్యాచ్ అనంతరం రిఫరీ ఐసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ సమయంలో భారత ఓపెనర్ తన పొరపాటును అంగీకరించింది. దాంతో, లెవల్ 1 తప్పిదంగా పరిగణించి ఆమెకు మ్యాచ్ ఫీజులో పది శాతం కోత.. ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
Big breakthrough for England! 🔥
The well-set Pratika Rawal departs for 36.🏏#CricketTwitterpic.twitter.com/E9cJVtSS3i
— Female Cricket (@imfemalecricket) July 16, 2025
ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌పైనా గురి పెట్టింది. తొలి వన్డేలో 259 పరుగుల ఛేదనలో దీప్తి శర్మ (62 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(48)ల మెరుపులతో అద్భుత విజయంతో సిరీస్‌లో ముందంజ వేసింది హర్మన్‌ప్రీత్ కౌర్ సేన. జూన్ 19న లార్డ్స్ మైదానంలో జరుగబోయే రెండో మ్యాచ్‌లోనూ ఆతిథ్య జట్టును చిత్తు చేసి సిరీస్ పట్టేయాలనే కసితో ఉంది.