Turkayanjal | తుర్కయంజాల్, జూలై 18 : మున్సిపాలిటీ పరిశుభ్రతకు నిత్యం శ్రమించే కార్మికులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి అన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్ వార్డు కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం కార్మికులు మెగా హెల్త్ క్యాంపులో కంటి పరీక్షలు, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్, గైనకాలజీకి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోని మందులను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్, ఆర్వో శ్రీనివాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.