అంట్వెర్ప్ (బెల్జియం): ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ యూరోపియన్ అంచెలో భారత జట్టు వరుస ఓటముల పరంపరకు ఎట్టుకేలకు బ్రేక్ పడింది. ఏడు పరాభవాల తర్వాత భారత జట్టు.. ఆదవారం జరిగిన మ్యాచ్‌లో 4-3తో బెల్జియంపై గెలిచి ఊరట విజయాన్ని దక్కించుకుంది.
ఆట చివరి క్వార్టర్లో మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 3-3తో ఉన్న సమంగా ఉన్నప్పటికీ పెనాల్టీ స్ట్రోక్ అవకాశాన్ని భారత సారథి హర్మన్‌ప్రీత్.. గోల్‌గా మలచడంతో మెన్ ఇన్ బ్లూ విజయదరహాసం చేసింది. పురుషుల జట్టు ఓటముల గండాన్ని అధిగమించినా అమ్మాయిలకు మాత్రం ఓటమి తప్పలేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. 0-2తో బెల్జియం చేతిలో ఓడి ఆరో పరాభవాన్ని మూటగట్టుకుంది.