Kenya Head Coach : ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన కెన్యా(Kenya) ఇప్పుడు కనుమరుగైపోయింది. ఆఫ్రికన్ లీగ్స్‌లో మినహా పెద్దగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టును చక్కదిద్దాలనుకున్న భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ (Dodda Ganesh)కు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే అతడిపై వేటు పడింది.
గణేశ్‌ను పదవి నుంచి తొలగిస్తూ కెన్యా క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. మాజీ పేసర్ అయిన గణేశ్ ఆగస్టు 14వ తేదీన కెన్యా జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు. నెల తిరిగిందో లేదో ‘నువ్వు మాకు వద్దు పొమ్మంటూ’ ఆ దేశ బోర్డు అతడికి పెద్ద షాకిచ్చింది. కెన్యాకు లామెక్ ఒన్యాంగో (Lamec Onyango)మధ్యంతర కోచ్‌గా ఎంపికయ్యాక గణేశ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటికీ సహాయక సిబ్బందిగా ఉన్న జొసెఫ్ అంగార, జోసెష్ అసిచీలతో కలిసి గణేశ్ జట్టును గాడీలో పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, 30 రోజుల్లోనే అతడి సేవల్ని కెన్యా బోర్డు వద్దనుకుంది.
Spoke with former India & Karnataka pacer #DoddaGanesh on his appointment as the head coach of the Kenya men’s cricket team.@doddaganesha: “I don’t believe in copybook cricket, I believe in open nets.”
https://t.co/wWavYiJ3MO— Prasanna Venkatesan (@prasreporter) August 14, 2024
అసలేం జరిగిందంటే.. కార్యనిర్వాహక శాఖ హెడ్‌కోచ్‌గా గణేశ్ నియామకాన్ని అమోదించలేదు. దాంతో, కెన్యా బోర్డు ‘ఇక మీరు కోచ్‌గా అవసరం లేదు’ అంటూ ఆ దేశ మహిళా క్రికెట్ డైరెక్టర్ పీర్లినే ఒమామీ పేరుతో బోర్డు తరఫున గణేశ్‌కు సందేశం పంపింది. అయితే.. ఎందుకు తొలగిస్తున్నారు? అనే దానికి స్పష్టమైన కారణం మాత్రం చెప్పలేదు. దేశవాళీ క్రికెట్లో కర్నాటక తరఫున ఆడిన గణేశ్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది కొన్ని మ్యాచ్‌లే. భారత జెర్సీతో అతడు నాలుగు టెస్టులు, ఒక వన్డే మాత్రమే ఆడాడు.