Thalapathy 69 | టార్చ్ బేరర్‌గా విజయ్.. ‘దళపతి 69’ అనౌన్స్మెంట్ వచ్చేసింది
Thalapathy Vijay | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం అనౌన్స్మెంట్ వచ్చేసింది. రాజకీయల్లోకి ఎంట్రీ విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందరూ గోట్ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అనుకున్నారు.
Thalapathy Vijay | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం అనౌన్స్మెంట్ వచ్చేసింది. రాజకీయల్లోకి ఎంట్రీ విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందరూ గోట్ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అనుకున్నారు. అయితే గోట్ కాకుండా అభిమానుల కోసం మరో సినిమాను ప్రకటించాడు విజయ్. తన చివరి చిత్రం ప్రజ సమస్యలపై ఉండబోతున్నట్లు ప్రకటించాడు.
విజయ్ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమా సక్సెస్‌లో ఉన్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అని ప్రచారం జరిగింది. విజయ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు కూడా దళపతికి ఇదే లాస్ట్ మూవీ అని గోట్ సినిమాకు తరలివెళుతున్నారు.
అయితే తాజాగా దళపతి 69 సినిమాకు సంబంధించి అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. దళపతి 69 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్.వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు. అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుందని టాక్. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
We are beyond proud & excited to announce that our first Tamil film is #Thalapathy69, directed by the visionary #HVinoth, with music by the sensational Rockstar @anirudhofficial 🔥
Super happy to collaborate with the one and only #Thalapathy @actorvijay ♥️
The torch bearer of… pic.twitter.com/Q2lEq7Lhfa
— KVN Productions (@KvnProductions) September 14, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

