ODI World Cup 2023 | కాసుల వర్షం కురిపించిన వరల్డ్ కప్.. ఏకంగా రూ.22 వేల కోట్ల ఆదాయం
ODI World Cup 2023 : పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup) అభిమానులకు మస్త్ మజానిచ్చింది. భారత జట్టు కప్పు కొట్టి ఉంటే ఆ సంతోషం మరింత రెట్టింపయ్యేది. అయితే.. ఈ మోగా టోర్నీ భారత క్రికెట్ బోర్డు(BCCI)కి కాసుల వర్షం...
ODI World Cup 2023 : పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup) అభిమానులకు మస్త్ మజానిచ్చింది. భారత జట్టు కప్పు కొట్టి ఉంటే ఆ సంతోషం మరింత రెట్టింపయ్యేది. అయితే.. ఈ మోగా టోర్నీ భారత క్రికెట్ బోర్డు(BCCI)కి కాసుల వర్షం కురిపించింది. అంతకంటే ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ(Indian Economy)ను కోట్లకు పడగలెత్తేలా చేసింది.
అవును.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగిన ప్రపంచ కప్‌తో ఏకంగా రూ.22 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ట్రావెల్(Travel), హాస్పిటాలిటీ(Hospitality) రంగం నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రావడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచ కప్ టోర్నీ వీక్షించేందుకు అభిమానులు రైళ్లు, విమాన టికెట్లు బుక్ చేసుకోవడం, హోటళ్లు బుక్ చేసుకోవడం ద్వారా కోట్లలో ఖర్చు చేశారు. అధికారిక వెబ్సైట్, బుక్‌మైషో(bookmyshow) వెబ్సైట్ ద్వారా టికెట్ల అమ్మకాలతో బీసీసీఐకి కూడా దండిగా ఆదాయం వచ్చింది.

ప్రపంచంలోని క్రికెట్ బోర్డులలో అత్యంత సంపన్నమైన బీసీసీఐ నికర ఆదాయం విలువ ప్రస్తుతానికి రూ.18,760 కోట్లుగా ఉంది. ఇక బిగ్‌బాష్ లీగ్(BBL) పుణ్యమాని ఆస్ట్రేలియా క్రికెట్‌కు రూ. 658 కోట్లు వచ్చాయి. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు రూ.493 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో నిలిచింది.
వరల్డ్ కప్ ట్రోఫీతో 10 జట్ల కెప్టెన్లు

సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కప్పు కొట్టలేదనే బాధ అభిమానుల మనసులోంచి పోవట్లేదు. లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ ఓటమన్నదే ఎరుగని రోహిత్ సేన అనూహ్యంగా టైటిల్ పోరులో తడబడింది. బ్యాటింగ్‌కు అనూలించని పిచ్‌పై కంగారూల పేస్, స్పిన్ ఉచ్చులో పడింది. విరాట్ కోహ్లీ(54), కేఎల్ రాహుల్(66) పోరాడడంతో టీమిండియా 240 పరుగులకే పరిమితమైంది.

లక్ష్య ఛేదనలో షమీ ఆదిలోనే బ్రేక్ ఇచ్చినప్పటికీ ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్) పట్టుదలతో క్రీజును అట్టిపెట్టుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యంలో ఆస్ట్రేలియా గెలుపొందింది. దాంతో, రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్ సాధించిన జట్టుగా ఆసీస్ చరిత్ర సృష్టించింది.
ఇవి కూడా చదవండి
- Free Bus Journey | బాబోయ్ ఉచిత బస్సులు.. పథకం అమలుతో కర్ణాటకలో కొత్త సమస్యలు
- Ind Vs Eng 2nd T20 | నేడు ఇంగ్లండ్‌తో రెండో టీ20.. సిరీస్ సమంచేయాలన్న పట్టుదలతో టీమ్ఇండియా
- Akbaruddin Owaisi | ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ.. ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

