Akbaruddin Owaisi | ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ.. ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ మూడో శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ మూడో శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత శాసనసభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీదర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు.
స్పీకర్ ఎంపికకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే స్పీకర్గా నిర్ణయించింది. ఈనేపథ్యంలో ఆయన ఎంపిక నామమాత్రమే కానుంది. కాగా, సాధారణంగా సభలో సీనియర్ అయిన సభ్యుడు ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

