IPL Mega Aution : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత సీజన్లో కెప్టెన్లుగా ఉన్న రిషభ్ పంత్ (Rishabh Pant), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సహా పలువురు స్టార్ ఆటగాళ్లు ఈసారి వేలంలోకి రావడమే అందుకు కారణం. దాంతో, ఈసారి అత్యధిక ధర పలికేది ఎవరు? ఎవరెవరు ఏ కనీస ధరకు పేర్లు నమోదు చేసుకున్నారు? అనేది తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా చూపుతున్నారు. అయితే.. ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా జాబితా విడుదల చేయలేదు. కానీ, ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెబ్సైట్ ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలను వెల్లడించింది.
మూడేండ్లకు ఓసారి జరిగే మెగా వేలం ప్రతి ఫ్రాంచైజీకి స్క్వాడ్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. అందుకని వేలంలో ప్రతిభావంతులను, అనుభవజ్ఞులను కొనేందుకు 10 జట్ల యజమానులు సిద్ధమవుతున్నారు. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో వేలం జరుగనుంది. ఈసారి 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం మొదట అత్యధిక ధర అయిన రూ. 2 కోట్ల నుంచి వేలం మొదలు పెడుతారు. కాబట్టి ఈ బేస్ ప్రైజ్‌లో ఎవరెవురు ఉన్నారో చూద్దాం.
✍️ 1574 Player Registrations
🧢 320 capped players, 1,224 uncapped players, & 30 players from Associate Nations
🎰 204 slots up for grabs
🗓️ 24th & 25th November 2024
📍 Jeddah, Saudi Arabia
Read all the details for the upcoming #TATAIPL Mega Auction 🔽🤩
— IndianPremierLeague (@IPL) November 5, 2024
అందరూ ఊహించినట్టుగానే పంత్, రాహుల్, అయ్యర్లు రూ.2 కోట్ల కనీస ధరకు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్లతో పాటు భారత పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్లు అశ్విన్, యజ్వేంద్ర చాహల్‌లు సైతం ఇదే ధరకు వేలానికి రానున్నారు. విదేశీ క్రికెటర్ల విషయానికొస్తే.. 17వ సీజన్ మినీ వేలంలో రూ.24.75 కోట్లతో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ కూడా రూ.2 కోట్ల కనీస ధరకు వేలంలో పాల్గొంటున్నాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సైతం ఇదే కనీస ధరకు వేలానికి వస్తున్నాడు.
🚨 2 Crore Base Price Players in the Mega Auction! 🚨
Shreyas Iyer, KL Rahul, Pant, Ashwin, Chahal, Shami, Khaleel, Deepak Chahar, Venkatesh Iyer, Avesh, Ishan, Mukesh, Bhuvi, Prasidh, Natarajan, Padikkal, Krunal, Harshal, Arshdeep, Washington, Shardul, Siraj, Umesh.
Who’s… pic.twitter.com/hbEDGuCaqN
— Hamza Saberi 🇮🇳 (@saberi_hamza) November 5, 2024
కనీస ధర రూ. 2 కోట్లు : రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, చాహల్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, టి.నటరాజన్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, సిరాజ్, ఉమేశ్ యాదవ్.
We’re coming to Jeddah, the land that’s next to 𝘙𝘦𝘥 𝘚𝘦𝘢,
With a strong vision for our future, you’ll see. 🙌❤️🔥With a maximum of 2️⃣2️⃣ slots left to fill, we are ready to #BidForBold at the #IPLMegaAuction. 🏏🌟
Are you excited, 12th Man Army? 🤩#PlayBold #SaveTheDate… pic.twitter.com/ltOsvRtL65
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 5, 2024
ఇక భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా, టెస్టు సంచలనం సర్ఫరాజ్ ఖాన్లు రూ. 75 లక్షలకు వేలంలో పాల్గొంటున్నారు. ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) రూ.1.25 కోట్లకు వేలంలో పేరు నమోదు చేసుకోవడం విశేషం. ఐపీఎల్ యాజమాన్యం త్వరలోనే 1,574 మంది క్రికెటర్లు ఏ ధరకు పేర్లు నమోదు చేసుకున్నారో త్వరలోనే వెల్లడించనుంది.
Legendary James Anderson has registered for the IPL 2025 mega auction at a base price of INR 1.25 crore.
Which team should pick him? pic.twitter.com/ohDXl09XmG
— CricTracker (@Cricketracker) November 5, 2024
ఐపీఎల్ మెగా వేలం కోసం ప్రతి ఫ్రాంచైజీలకు రూ.120 కోట్ల పరిమితి విధించింది. 10 ఫ్రాంచైజీలలో పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.83 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 73 కోట్లు, గుజరాత్ టైటాన్స్ పర్స్‌లో రూ. 69 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ జేబులో రూ. 69 కోట్లు ఉండగా..
🚨 All the retained players ahead of the mega auction for IPL 2025 🚨https://t.co/zKx8wr8Yn3 | #IPL2025 pic.twitter.com/pbcxt9v3iZ
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2024
చెన్నై సూపర్ కింగ్స్ పర్స్‌లో రూ.55 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఖాతాలో రూ.51 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ వద్ద రూ. 45 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.45 కోట్లు ఉండగా.. తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ వద్ద అత్యల్పంగా రూ.41 కోట్లు మాత్రమే కలవు.