Bitcoin: ట్రంప్ విక్టరీతో ఆల్‌టైం హైలో బిట్‌కాయిన్
Bitcoin : బిట్‌కాయిన్ మళ్లీ ఊపందుకున్నది. ట్రేడింగ్‌లో 75 వేల డాలర్ల మార్క్ అందుకున్నది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విక్టరీతో.. క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకున్నది.
న్యూయార్క్: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్(Bitcoin) మళ్లీ పుంజుకున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం కావడంతో.. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో దూసుకెళ్లింది. బైనాన్స్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంపై బీటీసీ ఎక్స్చేంజ్ రేటు కొత్త రికార్డు క్రియేట్చేసింది. ట్రేడింగ్‌లో సుమారు 9.26 శాతం పెరుగుదల చూపించింది. ఓ దశలో ఆ కరెన్సీ విలువ 75వేల డాలర్లుగా ట్రేడ్ అయ్యింది. ఆ తర్వాత 74.2 వేల డాలర్లకు స్థిరపడింది. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు ఉత్తమ ప్రదర్శన ఇచ్చాయి. ఎథీరియమ్ కాయిన్ కూడా మార్కెటింగ్‌లో మెరుగ్గా ట్రేడింగ్ అయ్యింది. వైట్‌హౌజ్ రేసులో ట్రంప్ దూసుకెళ్తున్నట్లు సంకేతాలు అందడంతో.. క్రిప్టో ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ సూపర్ షో ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో.. క్రిప్టో ఇన్వెస్టర్లకు ట్రంప్ హామీ ఇచ్చారు. న్యూయార్క్ సిటీ బార్లో తమ పార్టీ మద్దతుదారులకు చీజ్బర్గర్లు, బీర్లు కొనేందుకు బిట్‌కాయిన్‌ను ట్రంప్ వాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

