ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెటర్లు, కోచింగ్ సహాయ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ముంబైలోని బయో బబుల్‌లో అడుగుపెట్టారు. ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్‌కు బయల్దేరనుంది.ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు జిమ్‌లోనే కసరత్తులు చేస్తున్నారు. రోజురోజుకీ శారీరకంగా ధృడంగా తయారవుతున్నారు.
ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రహానె, ఉమేశ్ యాదవ్, మయాంక్ అగర్వాల్ తదితరులు ఔట్‌డోర్ ప్రాక్టీస్ లేకపోవడంతో జిమ్‌లోనే చెమటోడ్చారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇంగ్లాండ్ టూర్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు తలపడుతుంది.
Getting stronger each day! 💪💪#TeamIndia pic.twitter.com/0bZFml1gxL
— BCCI (@BCCI) May 26, 2021