దుబాయ్: దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ పేసర్ హరిస్ రవూఫ్ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఐసీసీ ప్రవర్తనా, నియామవళిని ఉల్లంఘించినందుకు గాను సూర్యకుమార్ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా పడగా, రవూఫ్‌పై జరిమానాతో పాటు రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. తీవ్ర ఉద్విగ్న పరిస్థితుల మధ్య సాగిన మ్యాచ్‌లో ఇరు దేశాల క్రికెటర్లు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు.
టీమ్ఇండియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రవూఫ్ వివాదస్పద సంజ్ఞలు చేశాడు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై దాడి చేసిన భారత ఆర్మీకి సూర్య మద్దతుగా నిలిచాడు. ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకుంటూ సూర్య, రవూఫ్‌పై జరిమానాతో, నిషేధం విధించారు. దీంతో దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే రెండు వన్డే మ్యాచ్‌లకు రవూఫ్ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే ఆసియాకప్‌లో నిబంధనలు ఉల్లంఘించిన బమ్రా, అర్ష్‌దీప్‌సింగ్, ఫర్హాన్‌కు ఒక్కో డీమెరిట్ పాయింట్ విధించారు.