నోయిడా: ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు తొలిరోజే అదరగొట్టారు. ఏడాది విరామం తర్వాత బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రీతి పవార్.. మహిళల 54 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఉమెన్స్ క్వార్టర్స్‌లో ప్రీతి.. నిగిన ఉక్తొమొవ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించి సెమీస్ చేరింది.
ఆమెతో పాటు 48 కిలోల విభాగంలో ప్రపంచ చాంపియన్ మీనాక్షి హుడా, పురుషుల క్యాటగిరీలో నరేందర్ (+90 కిలోలు), అంకుష్ పంగల్ (80 కి.) సైతం సెమీస్ చేరారు.