సెమీస్‌కు నిఖత్.. భారత్‌కు మూడు పతకాలు ఖాయం
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. టోర్నీ ఐదో రోజు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు ప్రియా, ప్రీతి పవార్ సైతం సెమీస్‌కు చేరి దేశానికి మూడు పతకాలు ఖాయం చేశారు. మహిళల 51 కిలోల క్యాటగిరీ క్వార్టర్ బౌట్లో ఆదినుంచే పూర్తి నియంత్రణతో ఆడిన నిఖత్..
- ప్రియా, ప్రీతి జోరు
ఉలన్బాతర్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. టోర్నీ ఐదో రోజు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు ప్రియా, ప్రీతి పవార్ సైతం సెమీస్‌కు చేరి దేశానికి మూడు పతకాలు ఖాయం చేశారు. మహిళల 51 కిలోల క్యాటగిరీ క్వార్టర్ బౌట్లో ఆదినుంచే పూర్తి నియంత్రణతో ఆడిన నిఖత్.. రిఫరీ స్టాప్ కాంటెస్ట్ (ఆర్ఎఫ్సీ)తో ఫిలిప్పీన్స్‌కు చెందిన జియాన్ బగుహిన్ను ఓడించి సెమీస్ చేరింది.
సెమీస్‌లో ఈ తెలంగాణ అమ్మాయి.. 2024 ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన వు యు (చైనా)తో అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల 60 కిలోల విభాగంలో ప్రియ.. 4-1తో చెంగ్యు యాంగ్ (చైనా)ను చిత్తుచేసింది. ఫైనల్ బెర్తు కోసం ఆమె సెమీస్‌లో నమున్ మొంఖొర్ (మంగోలియా)తో తలపడుతుంది. 54 కేజీల క్యాటగిరీలో వరల్డ్ బాక్సింగ్ కప్ స్వర్ణ విజేత ప్రీతి.. 5-0తో మంగున్ సెత్సెగ్ (మంగోలియా)ను మట్టికరిపించి సెమీస్‌కు అర్హత సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

