హార్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 5-0తో ఏకపక్ష విజయం సాధించి వరుసగా రెండు విజయాలతో క్వార్టర్స్ బెర్తును దక్కించుకుంది. సింగిల్స్ విభాగాల్లో పారిస్ ఒలింపియన్ లక్ష్యసేన్.. 21-14, 21-16తో ఎఫ్రియమ్ స్టీఫెన్‌పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆయుష్ శెట్టి.. 21-8, 21-6తో ష్రె దాండ్ను చిత్తుగా ఓడించాడు. డబుల్స్ పోరులో భారత స్టార్ పెయిర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. 21-14, 21-16తో రిజ్కి హిదాయత్, జాయ్ యును మట్టికరిపించి భారత ఆధిక్యాన్ని 3-0కు పెంచారు. మూడో సింగిల్స్‌లో ప్రణయ్.. 21-11, 21-17తో రిషి హోండా భూపతిని 30 నిమిషాల్లో చిత్తుచేశాడు. రెండో డబుల్స్‌లో హరిహరన్-అర్జున్.. 21-12, 21-10తో రమడియాన్స్య ఎఫ్రియమ్ జోడీని ఓడించడంతో ఆస్ట్రేలియాను స్వీప్ చేసినైట్టెంది. కాగా గ్రూప్‌లో అగ్రస్థానం కోసం భారత్, చైనా బుధవారం అమీతుమీ తేల్చుకోనున్నాయి.