Paris Olympics 2024 : భారత షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) పారిస్ ఒలింపిక్స్‌లో బోణీ కొట్టాడు. మెగా టోర్నీ గ్రూప్ దశ మ్యాచ్‌లో ఘన విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో కెవిన్ కార్డాన్ (Kevin Cordon)పై లక్ష్యసేన్ అలవోకగా గెలుపొందాడు.
తొలి సెట్‌ను 21-8తో సొంతం చేసుకున్న భారత షట్లర్‌కు రెండో సెట్లో గట్టి పోటీనిచ్చాడు. అయితే.. ఏమాత్రం పట్టువిడవని లక్ష్యసేన్ 22-20తో సెట్‌ను ముగించి కెవిన్‌కు చెక్ పెట్టాడు.
ఇక టెన్నిస్‌లో మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్, వరల్డ్ నంబర్ 3 కార్లోస్ అల్కరాజ్‌లు ముందంజ వేశారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఇద్దరూ విక్టరీ కొట్టి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఈ మధ్యే వింబుల్డన్ టైటిల్ గెలుపొందిన అల్కరాజ్ తొలి ఒలింపిక్స్‌ను ఘనంగా ఆరంభించాడు.