IND vs SL : తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ ఓడిన టీమిండియాకు యువ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(40), శుభ్మన్ గిల్(34)లు అదిరే అరంభమిచ్చారు. ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(28), రిషభ్ పంత్(9)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. జోడించారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్.. 111/2.
తొలి ఓవర్ నుంచే యశస్వీ జైస్వాల్(40), శుభ్మన్ గిల్(34)లు లంక బౌలర్లను చీల్చిచెండాడుతూ బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొట్టడంతో స్కోర్ బోర్డు పరుగలు పెట్టింది. 5 ఓవర్లకే స్కోర్ 50 దాటింది.
Wickets off consecutive balls, and India lose both their openers!
SKY and Pant are at the crease now with the score at 74/2 👉 https://t.co/fozZBSbiLQ #SLvIND pic.twitter.com/IiFxi2aaxF
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2024
అయితే.. దిల్షాన్ మధుశనక వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది చివరి బంతికి క్యాచ్ ఇచ్చాడు. దాంతో తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బంతి అందుకున్న వనిందు హసరంగ డేంజరస్ యశస్వీని బోల్తా కొట్టించాడు. డిఫెన్స్ ఆడబోయిన యశస్వీని వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ స్టంపౌట్ చేశాడు. దాంతో, టీమిండియా 74 వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. టీ20 పవర్ ప్లేలో లంకపై టీమిండియాకు ఇదే రికార్డు స్కోర్ కావడం విశేషం. చిచ్చరపిడుగులు ఇద్దరూ ఔట్ కావడంతో లంక బౌలర్లు బతికిపోయామురా అన్నట్టు ఊపిరిపీల్చుకున్నారు.