నంద్యాల : నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం (Srisailam) గోశాల వద్ద చిరుత (Cheetah) సంచారం కలకలం సృష్టిస్తోంది. శనివారం ఉపాలయం వద్ద చిరుత రాకను గమనించిన సెక్యురిటీ గార్డులు కేకలు వేయడంతో అక్కడి నుంచి చిరుత సమీప అటవిప్రాంతంలోకి పారిపోయింది. ఇటీవల కాలంలో చిరుత ఆరుసార్లు ఆలయ సమీపంలోకి రావడం పట్ల భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈనెల 18న పాతాళ గంగ పాత మెట్ల మార్గం వెళ్లే వైపు చిరుత సంచారాన్ని గమనించిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుత సంచరించగా అటవీశాఖ అధికారులు డోలు శబ్దాలు చేయించడంతో తరువాత చిరుత కనిపించకుండా పోయింది.
చిరుత నివాస ప్రాంతాల్లో రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా స్థానికులు, భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అధికారులు సూచించారు.
Pawan Kalyan | మీపైనే కాపులు నమ్మకం పెట్టుకున్నారు.. పవన్‌కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ