BJP LP Leader | బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఎన్నిక
BJP LP Leader | ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేత గా పి. విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేత (BJP legislative party) గా పి. విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ ((Visakapatnam North) ) నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ ఆదేశాల మేరకు విష్ణుకుమర్ రాజును ఎల్పీ లీడర్గా శనివారం ఎన్నుకున్నారు. 2014-19 మధ్య కూడా బీజేపీ ఎమ్మెల్యేగా చంద్రబాబు హయాంలో పనిచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. 2019-24 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రం దిగజారిపోయేలా పాలన జరిగిందని ఆరోపించారు. తనను కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని తెలిపారు. బిల్లులు చెల్లించకుండా గుత్తేదారులను వేధించారని విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ( Janasena) కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల విజయం సాధించారు. అదే విధంగా టీడీపీ 144 స్థానాలకు గాను 134 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల గెలుపొందింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

