న్యూఢిల్లీ, జనవరి 8 : మొబైల్ ఫోన్ రిచార్జ్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగ సంస్థలు ఈ ఏడాది జూన్‌లో టారిఫ్ ప్లాన్లను 15 శాతం పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి.
ఈక్విటీ అనలిస్ట్ అక్షత్ అగర్వాల్, ఈక్విటీ అసోసియేట్ ఆయుష్ బన్సల్ గురువారం విడుదల చేసిన జెఫ్రీస్ నివేదిక ప్రకారం.. జియో ఐపీవోతో పరిశ్రమ విలువ పెరుగుతుందని, అప్పుడు మొబైల్ సేవల రేట్లను పెంచుకోవడానికి టెక్నికల్‌గా కావాల్సిన మద్దతు కంపెనీలకు వస్తుందని అంటున్నారు. కాగా, చివరిసారిగా రెండేండ్ల కిందట మొబైల్ చార్జీలు పెరిగాయి.