మొబైల్ ఫోన్ రిచార్జ్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగ సంస్థలు ఈ ఏడాది జూన్లో టారిఫ్ ప్లాన్లను 15 శాతం పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి.
మొబైల్ వినియోగదారులకు మళ్లీ షాకివ్వబోతున్నాయి టెలికాం సంస్థలు. ఇప్పడికే మొబైల్ చార్జీలను పెంచి కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టిన సంస్థలు తాజాగా మరోసారి రీచార్జీలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి.