BCCI Women | లార్డ్స్‌లో భారత క్రికెటర్ల ఫొటోషూట్.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!
BCCI Women : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు ఏకైక టెస్టుకు సమాయత్తమవుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీకి ముందు టీమిండియా క్రికెటర్లు ఫొటోషూట్‌లో సందడి చేశారు.
BCCI Women : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు ఏకైక టెస్టుకు సమాయత్తమవుతోంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన లార్డ్స్‌లో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్టు కావడంతో ఈ మ్యాచ్ ఎనలేని ప్రధాన్యం సంతరించుకుంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీకి ముందు టీమిండియా క్రికెటర్లు ఫొటోషూట్‌లో సందడి చేశారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లు బ్యాటుతో పోజివ్వగా.. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ బంతితో కెమెరాకు స్టిల్ ఇచ్చింది.
లార్డ్స్ టెస్టుకు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది టీమిండియా. మహిళల టీ20 ప్రపంచకప్ వైఫల్యం నుంచి బయటపడిన భారత్.. లార్డ్స్ ఏకైక టెస్టులో విజయంతో మురవాలనే కసితో ఉంది. మ్యాచ్ సన్నద్ధత పూర్తవ్వడంతో గురువారం టీమిండియా ప్లేయర్లు జెర్సీలు ధరించి ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దిగ్గజాల ఫొటోలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లార్డ్స్ మైదానంలో ఫొటోలకు పోజిచ్చి మురిసిపోయారు.
Lights 💡
Camera 📸
Test Cricket 🏏Sneak peek into a fun 𝘽𝙏𝙎 from #TeamIndia’s photoshoot at Lord’s 🤍#ENGvIND pic.twitter.com/gOam4s2lea
— BCCI Women (@BCCIWomen) July 9, 2026
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కైర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మతో పాటు స్క్వాడ్‌లోని యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్, శ్రీ చరణి, నందిని శర్మ, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్ చిరునవ్వులు చిందిస్తూ మేము రెఢీ అని ఇంగ్లండ్‌కు హెచ్చరికలు పంపారు. మూడేళ్ల క్రితం జరిగిన ఏకైక టెస్టులో భారత్ 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అంతేకాదు.. 2006 నుంచి ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచుల్లో టీమిండియదే విజయం. దాంతో, ఈసారి లార్డ్స్‌లోనూ అతిథ్య జట్టుకు షాకివ్వాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తోంది.
— BCCI Women (@BCCIWomen) July 9, 2026
భారత స్క్వాడ్ : స్మృతి మంధాన(వైస్ కెప్టన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), శ్రీ చరణి, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నందిని శర్మ, హర్లీన్ డియోల్, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘారే, స్నేహ్ రానా, ప్రియా పూనియా.
ఇంగ్లండ్ స్క్వాడ్ : నాట్ సీవర్ బ్రంట్(కెప్టెన్), టమ్మీ బ్యూమంట్, లారెన్ బెల్, మైయా బౌచిర్, అలిసే క్యాప్సే, టిల్లీ కార్టీన్, సోఫీ ఎకిల్‌స్టోన్, లారెన్ ఫిలర్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, గ్రేస్ పాట్స్, ఎల్లీ థ్రెకెల్డ్, మాడీ విల్లెర్స్, ఇసీ వాంగ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

