IND vs WI | సిరీస్ ముగిసినా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు ప్రకటించలేదు..?
IND vs WI : భారత్ - వెస్టిండీస్ మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్(Queen's Park Oval)లో జరిగిన రెండో టెస్టు అనూహ్యంగా డ్రాగా ముగిసింది. వరుణుడు శాంతించకపోవడంతో సిరీస్ క్వీన్ స్వీప్ చేయాలనుకున్న టీమిండియా(Team India) కల నెరవేరలేదు. తొలి టెస్టులో గెలవడంతో 1-0తో రోహిత్ శర్మ బృందం సిరీస్ సొంతం చేసుకుంది. ఆశ్చర్యకరంగా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(player of the series) అవార్డు మాత్రం ఎవరికీ...
IND vs WI : భారత్ – వెస్టిండీస్ మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్(Queen’s Park Oval)లో జరిగిన రెండో టెస్టు అనూహ్యంగా డ్రాగా ముగిసింది. వరుణుడు శాంతించకపోవడంతో సిరీస్ క్వీన్ స్వీప్ చేయాలనుకున్న టీమిండియా(Team India) కల నెరవేరలేదు. అయినా కూడా తొలి టెస్టులో గెలవడంతో 1-0తో రోహిత్ శర్మ బృందం సిరీస్ సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన భారత పేసర్ సిరాజ్ (mohammad siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు విజేతను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.
ఆశ్చర్యకరంగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(player of the series) అవార్డు మాత్రం ఎవరికీ ప్రకటించలేదు. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు ఒకింత షాక్ అయ్యారు. ఈ అవార్డు ఇవ్వకపోవడానికి కారణం ఏంటనేది కూడా ఇప్పటివరకూ తెలియలేదు. ఈ విషయంపై స్పందించేందుకు ఇరుజట్ల కెప్టెన్లు ఆసక్తి చూపకపోవడం విశేషం. అయితే.. మరికొన్ని గంటల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
టెస్టుల్లో తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సిరాజ్

మొదట రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121) క్లాసిక్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత సిరాజ్ దెబ్బకు విండీస్ 255 పరుగులకు ఆలౌటైంది.రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టీ20 తరహాలో దంచికొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(57), ఇషాన్ కిషన్(52) అర్ధ శతకాలతో చెలరేగారు.
ఇషాన్ కిషన్(52)

భారీ ఆధిక్యం రావడంతో 181/2 వద్ద రోహిత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. 365 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఐదో రోజు విండీస్ ఆట కట్టించాలనుకున్న భారత్ ఆశ ఫలించలేదు. వర్షం తగ్గకపోవడంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో, తొలి టెస్టు గెలిచిన భారత్ 1-0తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య జూలై 27 నుంచి వన్డే సిరీస్ మొదలవ్వనుంది. ఇప్పటికే భారత్, వెస్టిండీస్ జట్లు 15మంది స్క్వాడ్‌ను ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి
Bismah Maroof | పిల్లలకు అనుమతి లేదని.. ఆసియా గేమ్స్ నుంచి తప్పుకున్న పాక్ క్రికెటర్
Satwiksairaj – Chirag Shetty | సాత్విక్ – చిరాగ్ జోడీకి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

